బాన్సువాడలో మహిళ అదృశ్యం

4చూసినవారు
బాన్సువాడలో మహిళ అదృశ్యం
బాన్సువాడ మండలం తాడ్కోలు గ్రామానికి చెందిన బోసు సుగుణ (23) ఈ నెల 26వ తేదీ నుండి కనిపించకుండా పోయింది. ఆమె ఆచూకీ గురించి బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఎలాంటి జాడ తెలియకపోవడంతో, బాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో ఆమె భర్త వెంకట్ గురువారం ఫిర్యాదు చేశారు. సుగుణ ఇంట్లో నుండి వెళ్ళినప్పుడు పసుపు రంగు చీర, పసుపు రంగు జాకెట్ ధరించి ఉందని, ఆమె ఆచూకీ తెలిసినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్