
బోధన్ సహకార బ్యాంకులో టాప్ డిపాజిటర్లకు స్వీట్స్ పంపిణీ
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని నిజామాబాద్ కేంద్ర సహకార బ్యాంక్, బోధన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో డిపాజిట్ల ప్రాధాన్యతను వివరిస్తూ, దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ టాప్ 10 డిపాజిటర్లకు స్వీట్స్ పంపిణీ చేశారు. బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ, సహకార బ్యాంకు వృద్ధికి డిపాజిట్లు కీలకమని, కస్టమర్ల నమ్మకమే బ్యాంకు బలం అని తెలిపారు. డిపాజిట్లు పెరిగితే రైతులు, వ్యాపారులు, సభ్యులకు రుణ సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. కస్టమర్లు బ్యాంకు సేవలను విస్తృతంగా వినియోగించుకుని, కొత్త డిపాజిట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు.






































