నవీపేట్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం

1415చూసినవారు
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో బుధవారం మధ్యాహ్నం పెను విషాదం చోటుచేసుకుంది. జగ్గారావు ఫారం సమీపంలో వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో, బైక్ నడుపుతున్న యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న బైక్‌ను బట్టి మృతుడు పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, మృతుడి కుటుంబ సభ్యుల కోసం ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్