ఎడపల్లి కెనాల్‌లో బాలిక మృతదేహం కలకలం

1423చూసినవారు
ఎడపల్లి కెనాల్‌లో బాలిక మృతదేహం కలకలం
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని ARP క్యాంప్ గ్రామ శివారులో ఉన్న D46 కెనాల్‌లో గురువారం గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సుమారు 10 ఏళ్ల లోపు వయస్సున్న బాలికగా అంచనా వేస్తున్నారు. బాలిక గుర్తింపు ఇంకా లభించలేదని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం తెలిసినవారు ఎడపల్లి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్