రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

397చూసినవారు
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
నవీపేట మండలంలోని నిజాంపూర్ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నవీపేటకు చెందిన రాజు(38) మరియు నిజామాబాద్‌కు చెందిన నరేష్ నాళేశ్వర్ వైపు వెళుతుండగా, నిజాంపూర్ కు చెందిన మల్లెపూల శ్రీనివాస్ తన బైక్‌పై స్వగ్రామానికి వస్తున్నారు. నిజాంపూర్ మూలమలుపు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రాజు అక్కడికక్కడే మృతి చెందగా, నరేష్, మల్లెపూల శ్రీనివాస్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను 108 అంబులెన్స్‌లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్