
కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ
నవీపేట్ మండలంలోని మోకెనపల్లి, సలీం ఫారం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులందరికీ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేస్తూ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు, పెట్రోల్ పంపులు, బస్సుల పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా వారి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








































