కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలో నాలుగో రోజు అట్ల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు హనుమాన్ దేవాలయం వద్ద బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.