వడదెబ్బ నివారణపై భాగీర్తిపల్లిలో అవగాహన

322చూసినవారు
వడదెబ్బ నివారణపై భాగీర్తిపల్లిలో అవగాహన
కామారెడ్డి జిల్లా, భిక్కనూర్ మండలం భాగీర్తిపల్లిలో వైద్యాధికారి యెమిమా ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణపై అవగాహన కార్యక్రమం జరిగింది. వేసవిలో ప్రజలు, ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు అప్రమత్తంగా ఉండాలని, తలకు దుస్తులు కట్టుకోవాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా తరచూ నీరు, ఓఆర్ఎస్ తీసుకోవాలని, మధ్యాహ్నం వేళ ఎండలో పని చేయకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you