
బీహార్లో పోలీసుల మత చిహ్నాలపై నిషేధం: డీజీపీ
బీహార్ పోలీస్ శాఖలో డీజీపీ వినయ్ కుమార్ జారీ చేసిన సరికొత్త నిబంధనలు రాష్ట్రంలో పెను సంచలనం రేపుతున్నాయి. ఇకపై పోలీసులు డ్యూటీలో ఉన్నప్పుడు నుదుటన తిలకం, చందనం వంటి ఎలాంటి మతపరమైన చిహ్నాలను ధరించకూడదని, టోపీ, బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు. మహిళా పోలీసులు మితిమీరిన మేకప్ వేసుకోకూడదని, యూనిఫాంలో రీల్స్ చేయడం, సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడంపై కఠిన నిషేధం విధించారు. ఈ ఆదేశాలపై హిందూ సంఘాలు, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.




