కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బసనపల్లిలో ఆదివారం గ్రామ దేవతల బోనాల ఉత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఏటా ఆచారం ప్రకారం గ్రామస్థులు అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామం సుఖశాంతులతో వర్ధిల్లాలని గ్రామ దేవతలను ప్రార్థించారు. ఈ వేడుకలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.