కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం గౌరారంలో రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ పనులు పూర్తయితే గ్రామంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వర్షాకాలంలో ఇబ్బందులు తగ్గుతాయని అధికారులు తెలిపారు. పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సూచించారు.