కామారెడ్డి కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్, ఎస్పీ పరిశీలన

0చూసినవారు
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో ఆదివారం ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తీసుకున్న ఏర్పాట్లను వారు పరిశీలించి, భద్రత, సీసీ కెమెరాలు, సిబ్బంది ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్