జుక్కల్ మండలం పెద్ద ఎక్లారా గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని ఆగస్టు 15న గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామంలో మద్యం అమ్మడం, నిల్వ చేయడం, సరఫరా చేయడం నిషేధించారు. అక్రమ మద్యం విక్రయాలు గుర్తిస్తే ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించాలని సూచించారు. ఈ తీర్మాన పత్రాన్ని సర్పంచ్ బుధవారం ఎక్సైజ్ అధికారులకు అందజేశారు. మద్యం రహిత గ్రామం దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు.