కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం మీదుగా గురువారం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది కాటూరి వెంకటేశ్వర్లు 'RaGa for Rise of India' నినాదంతో పాదయాత్ర చేశారు. పెద్ద కొడగల్ మండల
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్యామప్ప పటేల్ ఆధ్వర్యంలో నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి, మల్లప్ప పటేల్, బస్వరాజ్ దేశాయ్, నాగరాజు, రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ పాదయాత్ర కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ ప్రాంతంలో జరిగింది.