కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం శేఖాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి మొక్కజొన్న పంట పొలాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గురువారం ఉదయం గ్రామానికి చేరుకుని, బాధిత రైతుల పొలాలను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి విచారణ జరిపి, నివేదిక సిద్ధం చేసి రైతులకు తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.