
ఏపీలో కొత్త ఆక్వా కనెక్షన్లకూ విద్యుత్ సబ్సిడీ
AP: సీఎం చంద్రబాబు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 'బ్లూ ఎకానమీ' వృద్ధిని లక్ష్యంగా చేసుకుని, ఆక్వా రంగానికి మేలు చేసే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా నమోదైన 12,680 ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ. 1.50 విద్యుత్ సబ్సిడీని వర్తింపజేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై అదనంగా రూ. 188 కోట్ల భారం పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఎకరాల ఆక్వా భూములను 'ఆక్వా జోన్' పరిధిలోకి తీసుకురావాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించారు.




