గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్

435చూసినవారు
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్
కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్లో సోమవారం 'గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్' ఆధ్వర్యంలో గోసంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ సంతకాల సేకరణ చేపట్టారు. గోవధను పూర్తిగా నిర్మూలించాలని డిమాండ్ చేశారు. సేకరించిన సంతకాల పత్రాలను రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రికి పంపాలని ఎంఆర్టీకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్