
కేజీహెచ్‌లో సంతానలేమి సమస్యతో బాధపడే దంపతులకు ఉచితంగా చికిత్స
AP: సంతానలేమి సమస్యలతో బాధపడే దంపతులకు విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లే బదులుగా కేజీహెచ్‌లోనే అత్యాధునిక చికిత్సను ఉచితంగా అందిస్తున్నారు. కేజీహెచ్ ప్రసూతి విభాగంలో ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్ చికిత్సను ఇటీవల అందుబాటులోకి తెచ్చారు. పేద, మధ్యతరగతి దంపతులు ఈ చికిత్సను ఉపయోగించుకోవాలని కేజీహెచ్ వైద్యులు సూచిస్తున్నారు.




