కాటేపల్లిలో ఏరువాక పౌర్ణమి వేడుకలు: అన్న ప్రసాద వితరణ

1075చూసినవారు
కాటేపల్లిలో ఏరువాక పౌర్ణమి వేడుకలు: అన్న ప్రసాద వితరణ
కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండలంలోని కాటేపల్లి గ్రామ లక్ష్మీమాత గుడి వద్ద సోమవారం ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. కౌలాస్ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ 108 ష.బ్ర మల్లిఖార్జున శివాచార్యులు ముఖ్య అతిథిగా హాజరై, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. సుమారు 50 ఏళ్లుగా ఈ పూజలు జరుగుతున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటేపల్లి, సీతారాంపల్లి, అంజని గ్రామాలతో పాటు పలు గ్రామాల భక్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్