కామారెడ్డి జిల్లా, జుక్కల్ మండలం రాజంపేట గ్రామానికి చెందిన నాయిని శ్రీను అనే రైతు తన రెండెకరాల వరి పంటలో సుమారు అర ఎకరం పంటను గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి మందు పిచికారి చేసి నాశనం చేశారని మంగళవారం వ్యవసాయ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, వ్యవసాయ విస్తరణ అధికారి శిల్ప పంటను పరిశీలించి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.