బ్రిడ్జి గుంతలో పడి మత్స్యకారుడు మృతి

3చూసినవారు
బ్రిడ్జి గుంతలో పడి మత్స్యకారుడు మృతి
నిజాంసాగర్ మండలంలోని గోర్గల్గేటు బ్రిడ్జి వద్ద గుంతలో పడి బేస్త బొల్లారం బాలయ్య(40) అనే మత్స్యకారుడు మృతిచెందాడు. గురువారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై నిజాంసాగర్ వెళ్లిన బాలయ్య, రాత్రి ఇంటికి బయలుదేరినప్పుడు గోర్గల్ గేటు వద్ద బ్రిడ్జిపై ఉన్న గుంతలో బైక్ దిగబడటంతో కిందపడి గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఎల్లారెడ్డి, కామారెడ్డి ఆస్పత్రులకు తరలించగా, అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్