కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బీర్కూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ప్రతి వ్యక్తికి నాణ్యమైన ఆరోగ్య సేవలు, పరిశుభ్రమైన నీరు, పోషకాహారం పొందే హక్కు ఉందని సిహెచ్ఓ రవీందర్ తెలిపారు. అనంతరం ఆరోగ్య సంరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం బీర్కూరులో జరిగింది.