నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద వచ్చి చేరుతుండటంతో గురువారం ఉదయం 3 వరద గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రాజెక్టులోకి 20,514 క్యూసెక్కుల వరద వస్తోంది. వచ్చిన వరదను 3 గేట్ల ద్వారా మంజీరా నది మీదుగా గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, 12 గేట్లలో 3 గేట్లను తెరిచారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో గత 60 రోజులుగా నిరంతరాయంగా వరద వస్తూ కొత్త రికార్డు నమోదైంది.