జుక్కల్ మండలం హంగర్గా గ్రామంలో శనివారం, సుమారు 300 మందికి పైగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి జుక్కల్ అభివృద్ధి కోసమే నిరంతరం కృషి చేస్తున్నానని, ఈ సెగ్మెంట్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.