రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హాఫ్ డే పద్ధతిలో పనిచేస్తాయి. మే 1 నుంచి మే 31 వరకు అంగన్వాడీ పిల్లలతో పాటు టీచర్లు, హెల్పర్లకు వేసవి సెలవులు మంజూరు చేశారు. సెలవుల సమయంలో అంగన్వాడీ సిబ్బంది పిల్లలకు సరుకులు ఇంటికి పంపిణీ చేయాలి, 0-5 ఏళ్ల పిల్లల్లో అభివృద్ధి లోపాలను గుర్తించేందుకు ఇంటింటి సర్వేలు నిర్వహించాలి, ప్రీ-స్కూల్ పిల్లల నమోదు, డ్రాప్‌అవుట్ పిల్లలను తిరిగి చేర్పించే చర్యలు చేపట్టాలి.