ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Apr 26, 2026, 08:04 IST/

రోడ్డుపై రూ.500, రూ.200 నోట్ల కట్టలు.. స్థానికులు ఏం చేశారంటే?(వీడియో)

Apr 26, 2026, 08:04 IST
యూపీలోని షామ్లీలో రహదారిపై షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై రూ.500, రూ.200 నోట్ల కట్టలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో స్థానికులు అవాక్కయ్యారు. మీరట్-కర్నాల్ హైవేపై ఓ వంతెన సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 500 మీటర్ల మేర డబ్బు పడి ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకొని నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తం నగదు రూ.4 లక్షలు ఉన్నట్లు తేలింది. నోట్ల కట్టలకు బ్యాంకు స్లిప్పులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని చెప్పారు.