కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు 35,105 క్యూసెక్కుల భారీ వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. ఈ వరదను దృష్టిలో ఉంచుకొని, 5 వరద గేట్లను ఎత్తి 43,135 క్యూసెక్కుల నీటిని మంజీర ద్వారా గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వస్తున్న వరద కంటే 8,030 క్యూసెక్కుల అదనపు నీటిని విడుదల చేయడం గమనార్హం.