నిజాంసాగరలోకి 43, 135క్యూసెక్కుల భారీ వరద: 5 గేట్ల ఎత్తివేత

3చూసినవారు
నిజాంసాగరలోకి 43, 135క్యూసెక్కుల భారీ వరద: 5 గేట్ల ఎత్తివేత
నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా, సింగూర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో గోదావరి ఉపనది అయిన మంజీర ద్వారా నిజాంసాగర్ జలాశయంలోకి భారీ వరద వచ్చి చేరుతోంది. శుక్రవారం రాత్రి 8.30 గంటల వరకు ప్రాజెక్టులోకి 43,135 క్యూసెక్కుల వరద వస్తుందని ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. దీంతో 5 వరద గేట్లను ఎత్తి, 43,135 క్యూసెక్కుల నీటిని మంజీర ద్వారా గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టులో 1405 అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్