ఇందిరా మహిళా శక్తి చేపల వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

1004చూసినవారు
ఇందిరా మహిళా శక్తి చేపల వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నిజాంసాగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో శనివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఇందిరా మహిళా శక్తి చేపల విక్రయ వాహనాన్ని పంపిణీ చేశారు. ఈ వాహనం ద్వారా మహిళా ఉత్పత్తిదారులు నేరుగా మార్కెట్లోకి వెళ్లి చేపలను విక్రయించి స్వయం ఉపాధి పొందవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ సబ్సిడీతో అందించిన ఈ వాహనం మహిళా స్వయం సహాయక సంఘాల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన అన్నారు.