
రైల్లో అసభ్యంగా తాకాడు.. మహిళ చేతిలో తన్నులు తిన్నాడు
మధురై నుండి రామేశ్వరం వెళ్లే రైలులో ఒక మహిళ పక్కనే కూర్చున్న వ్యక్తి తనను అసభ్యంగా తాకాడని ఆరోపిస్తూ అతన్ని చితకబాదింది. ఈ ఘటనలో మహిళ భర్త కూడా తీవ్ర ఆగ్రహంతో ఆ వ్యక్తిని కొట్టాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




