ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ కాటూరి వెంకటేశ్వర్లు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుతూ 'RaGa for Rise of India' పేరుతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నారు. గురువారం కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గంలో బేగంపూర్ గేటు వద్ద ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు సౌదాగర్ అరవింద్, నాయకులు హన్మండ్లు తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికి, సన్మానించి మద్దతు తెలిపారు. వెంకటేశ్వర్లుతో పాటు వారు పాదయాత్రలో పాల్గొన్నారు.