
పెళ్లైన 2 నెలలకే భర్తను గొంతు కోసి చంపిన భార్య
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో పెళ్లైన 2 నెలలకే భార్య తన భర్తను చంపేసింది. 9 ఏళ్లు ప్రేమించుకున్న జితేంద్ర, జ్యోతి గతేడాది నవంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. అయితే జితేంద్ర ఆన్లైన్ జూదానికి బానిసై, భార్య ఖాతా నుంచి రూ.20 వేలు తీసుకున్నాడు. దీనిపై గొడవ జరగ్గా.. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె భర్త గొంతు కోసి చంపేసింది. మృతదేహాన్ని కిటికీకి వేలాడదీసి సూసైడ్‌గా నమ్మించింది. పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం బయటపడటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.




