జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం పిట్లం మండల కేంద్రంలోని సాయి గార్డెన్ లో పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పిట్లం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లోక శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి ప్రెస్ క్లబ్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రిపోర్టర్ రవి, సాయిబాబా, మునీర్, సాయిలు, నవీన్, పాల్గొన్నారు.