
తగ్గిన బంగారం ధరలు
ఇవాళ ఉదయం భారీగా పెరిగిన బంగారం ధరలు సాయంత్రానికి స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేట్ ఉదయంతో పోల్చితే రూ.1,090 తగ్గి రూ.1,59,440కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,000 పతనమై రూ.1,46,150 పలుకుతోంది. అలాగే కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.3,20,000గా కొనసాగుతోంది.




