కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో శుక్రవారం పోలీసుల ఆధ్వర్యంలో "రన్ ఫర్ యూనిటీ" కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ వెంకట్రావు నేతృత్వంలో ఉదయం 11 గంటలకు అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రారంభమై, గడి హనుమాన్ ఆలయం వద్ద సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహం వరకు ఈ పరుగు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పోలీసులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. దేశ ఐక్యత, సమగ్రతకు ప్రతీకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.