కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండల కేంద్రంలో శుక్రవారం కూరగాయల మార్కెట్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా సున్నంతో గీతలు వేసి, వ్యాపారులను లైన్లలో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమంలో పిట్లం ఎస్సై వెంకట్రావు, కానిస్టేబుల్ పాల్గొన్నారు. లోకల్ యాప్ లో రెండు మూడుసార్లు వార్తలు ప్రచురితమైన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు.