జుక్కల్ సెగ్మెంట్ పిట్లం మండల కేంద్రంలో సోమవారం 'గో' సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ ఆధ్వర్యంలో గో సంరక్షణ, గోవధ నిర్మూలనతో పాటు గోవులను జాతీయ జంతువులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సేకరించిన సంతకాల పత్రాలను తహసీల్దార్ కు వినతిపత్రంగా అందించారు. ఈ కార్యక్రమంలో విహెచ్ పి, భజరంగ్ దళ్, హిందు ఐక్యవేదిక ప్రతినిధులు, సభ్యులు పాల్గొని, గోవులను రక్షించాలని నినాదాలు చేశారు.