కామారెడ్డి జిల్లా, రాజంపేట మండల కేంద్రంలో లబ్ధిదారురాలు రంగా అర్చనకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని సోమవారం సర్పంచ్ శ్రీకాంత్ ప్రారంభించారు. మొదటి విడతలో ఇల్లు మంజూరు కాగా, నిర్మాణ పనులు పూర్తి చేసుకొని సర్పంచ్ చేతుల మీదుగా గృహప్రవేశం చేశారు. లబ్ధిదారు కుటుంబం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, చంద్రం, జమీల్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.