దోమకొండ కోటలో నేడు 'గ్రామీణ అభివృద్ధిలో సర్పంచుల పాత్ర'పై అవగాహన సదస్సు జరగనుంది. టీయూ సౌత్ క్యాంపస్, దోమకొండ ఫోర్ట్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో టీయూ వీసీ యాదగిరి రావు, అడిషనల్ కలెక్టర్ మధు మోహన్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. దోమకొండ, బీబీపేట్ తో పాటు ఐదు మండలాల సర్పంచులు హాజరవుతారని ప్రిన్సిపల్ డా. సుధాకర్ గౌడ్ తెలిపారు.