గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు: సర్పంచుల వినతి

905చూసినవారు
గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు: సర్పంచుల వినతి
మహమ్మద్ నగర్ మండలం పరిధిలోని గాలిపూర్, మగ్దుమ్‌పూర్ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం ఆయా గ్రామాల సర్పంచులు జి. కిరణ్, సుమయ్య అతీఖ్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావును హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయించాలని సర్పంచులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ఎలే మల్లికార్జున్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్