Top 10 viral news 🔥

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. నలుగురు మృతి
AP: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. కొంతమంది మహిళలు మందుగుండు సామగ్రి తయారు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఇంకా కర్మాగారంలో మరో 15 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.




