
పులి సంచారంతో అప్రమత్తమైన ప్రజలు (వీడియో)
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ రాత్రికి పులిని పట్టుకుంటామని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. పులి శాటిలైట్ సిటీ సమీపంలో రోజుకు 15-20 కిలోమీటర్లు ప్రయాణిస్తోందని తెలిపారు. రాజానగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ స్థానికులను, వాహనదారులను అప్రమత్తంగా ఉండాలని, హై అలర్ట్ ప్రకటించినట్లు స్పష్టం చేశారు.




