కామారెడ్డి జిల్లా రైతులపై ఎల్నినో కత్తి వేలాడుతోంది. అడపాదడపా కురిసిన వర్షాలకు జిల్లాలోని కౌలాస్ నాలా, పోచారం, సింగీతం, కల్యాణి ప్రాజెక్టుల్లోకి నీరు చేరి రైతుల్లో ఆశలు రేకెత్తించాయి. మరో వారం నుంచి పక్షం రోజుల్లో పంటలు చేతికి రానున్నాయి. వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టుల నుంచి కొంత మేరకు నీటిని వదులుతున్నా. కాలువల్లో పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు పెరగడంతో చివరి ఆయకట్టు వరకు అందడంలేదని రైతులు వాపోతున్నారు. గత వేసవిలో కాలువల్లో పూడిక తీయక, మరమ్మతులు చేపట్టకపోవడంతో నీళ్లు ముందుకు సాగే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.