కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో కుండపోత వర్షం కురిసింది. రోడ్లు సరిగా లేకపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల పొలం పనులు ప్రారంభించిన రైతులు కూడా వ
ర్షం వల్ల కష్టాలు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే రోడ్లను బాగుచేయాలని, లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.