
ప్రియుడితో వెళ్లిపోయి.. పిల్లల కోసం తిరిగొచ్చిన మహిళ
యూపీలోని క్యాంపియర్ గంజ్లో, ఇన్స్టాగ్రామ్ పరిచయంతో 28 ఏళ్ల యువకుడితో పారిపోయిన 40 ఏళ్ల మహిళ తన నలుగురు పిల్లలు, భర్త వద్దకు తిరిగి చేరుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల విజ్ఞప్తితో ఆమె మనసు మార్చుకుంది. రెండు గంటల పాటు జరిగిన ఈ సంఘటనలో, పిల్లల భావోద్వేగ విజ్ఞప్తితో ఆమె భర్తతో వెళ్లేందుకు అంగీకరించింది. పోలీసులు సమక్షంలో వివాదం సామరస్యంగా ముగిసింది.




