
బీజాపూర్‌లో మరో ఎన్కౌంటర్.. ఇద్దరు నక్సల్స్ హతం
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టినప్పుడు, నక్సలైట్లతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు నక్సలైట్లు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో AK-47 రైఫిల్, 9mm పిస్టల్, విప్లవ సాహిత్యం, ఇతర సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అడవిలో ఇంకా నక్సలైట్లు ఉన్నారనే అనుమానంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.




