
హిడెన్ కెమెరాల నివారణకు పోలీసుల ప్రత్యేక డ్రైవ్
హైదరాబాద్‌లో మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో వందకు పైగా షాపింగ్‌మాల్స్, లాడ్జిలకు నోటీసులు జారీ చేశారు. ట్రయల్రూమ్స్, రెస్ట్రూమ్స్లో గోప్యతను పాటించాలని, హిడెన్ కెమెరాలను గుర్తించే పరికరాలను ఉపయోగించాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.




