
ఐపీఎల్-2026: ఇవాళ డబుల్ ధమాకా
ఐపీఎల్-2026లో భాగంగా ఆదివారం డబుల్ ధమాకా ఉండనుంది. ఇవాళ కీలక జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. చెన్నై వేదికగా మ.3.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి. లక్నో వేదికగా రాత్రి 7:30 గంటలకు లక్నో సూపర్ జెయింట్స్ (LSG), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య మ్యాచ్ ఉండనుంది. జియో హాట్స్టార్లో మ్యాచ్ లైవ్ చూడవచ్చు.




