కామారెడ్డి: అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

2చూసినవారు
కామారెడ్డి: అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డిలోని వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియను నిశితంగా పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణలో ఆలస్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని అధికారులను ఆదేశించారు.