కామారెడ్డి ఆసుపత్రిలో 'బాల భరోసా' కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 0-5 ఏళ్ల చిన్నారుల్లో పెరుగుదల లోపాలు, అంగవైకల్యాలను ముందుగానే గుర్తించి చికిత్స అందించాలని సూచించారు. 13 RBSK బృందాలు అంగన్వాడీ కేంద్రాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారిని ఆసుపత్రికి రిఫర్ చేశాయి. మొదటి రోజే 31 మంది చిన్నారులకు చికిత్స, మందులు అందించారు.